సాహిత్య లోకానికి స్వాగతం…

sahitya lokam home page

అస్తమించే నాటకం

ప్రకృతి ఒడిలో ప్రియ కుసుమాల్లారా ఏకంకండి, కాల గమనం ఎప్పటికీ  పరుగెడు ఒంటిదోరణి బండి, చిరునవ్వులు చిందించే ఈ పుష్పం, రేపటి గమనంలో కాగలదు చర్మం కరిగిపోతున్న శవం. దివ్యమైన తేజస్సుగల ఆ సూర్యుడు, పై పైకి ఎగబాకుతున్నాడు, అతని నేటి నడక పూర్తికావస్తోంది, పడమరన ఈ నాటి నాటకం అస్తమించబోతుంది.  ప్రధమాంకంలో అనుభూతి చెందే వయసే ఉత్తమం, సత్తువగల శరీరం, ఉరకలు వేసే రక్తం మీ సొంతం.  అనుభూతి అనుభవమై, అనుభవం గుణపాఠామై, గుణపాఠం అధ్వానమైపోవును…

By సాహిత్య లోకం 26 Feb 2019 Off

రక్తం రుచి మరిగిన కొండముచ్చులు

సింహాచలంలో నివసించే వారికి అడవి పందులు, కుక్కలు, కుందేళ్లు వంటి జంతువుల్ని చూడటం కొత్తేమి కాదు. కొన్నిసార్లు చిరుతపులి జాడలు కనిపించడం కూడా సాధారణ విషయమే ఇక్కడ వారికి. కానీ ఆరోజు రాత్రి మాత్రం ఇంటి దగ్గర కుక్కలు ఒకటే గోల, అవి మొరుగుతుంటే చెవులు చిల్లులు పడుతున్నాయి. నిద్ర మాయం అయిపోయింది, ఇక చేసేదేమి లేక ఆ కుక్కల బాధ ఏంటో చూద్దాం అని కిటికీ దగ్గర నిల్చున్నాను. వీధి దీపాల వెలుతురులో నాలుగు కుక్కలు…

By సాహిత్య లోకం 22 Feb 2019 Off

చంద్రన్న, జగనన్న, పవనన్న, పిడక పెంటయ్య!!!

ఒక పిడక ఈ గోడ నుండి ఆ గోడకి వెళ్లి అంటుకుంది, ఆ గోడ మీద పిడక ఎటు వెళ్దామా అని ఆలోచిస్తుంది, ఇంతలో ఇంకో పిడక తన గోడ మీద ఉండే పిడకలను తిట్టిపోస్తూ తనకి నచ్చిన గోడని కౌగిలించుకుంది . ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకి అర్ధం కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో రాజకీయం, ఎన్నికలకు చేరిందని. ఇవన్నీ గమనిస్తున్న పిడక పెంటయ్యకి ఒకటి అర్ధం అయింది [ఆయనకి పిడక బాష వచ్చులెండి], ఈ రాష్ట్రం…

By సాహిత్య లోకం 20 Feb 2019 Off

ఆడవారూ!!! మీ ఆరోగ్యం మీ చేతుల్లో | 7 Health tips for women

దారిలో నడుస్తూ వెళ్తుండగా ఒక అమ్మాయిని చూడగానే, తాను చాలా ఆరోగ్యంగా ఉంది అని అనుకుంటాము. కానీ దాని వెనక కారణాలు ఆలోచించేంత సమయం మనకి ఉండదు. ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంది అంటే దానికి కారణం సంతోషం, శ్రమ మరియు ఆలోచనా విధానం. సంతోషం, శ్రమ ప్రతి వ్యక్తీ ప్రతి రోజూ ఎదురుపడేవే, కానీ ఆలోచనా విధానం మాత్రం మనమే దృఢపర్చుకోవాలి. అది అంత సులభమూ కాదు, అంత కష్టమూ కాదు, తామరాకు మీద నీటి…

By సాహిత్య లోకం 18 Feb 2019 Off

స్వర్గంలో రాక్షసుడు

ప్రతి మధ్యాహ్నం, బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, పిల్లలంతా ఆ రాక్షసుడి తోటలో ఆడుకునేవారు. ఆ తోట చాలా విశాలమైనది, మెత్తని గడ్డితో, పూల మొక్కలతో, పండ్ల చెట్లతో నిండి పిల్లలకి అమితమైన సంతోషాన్ని ఇచ్చేది. పక్షులు చెట్ల కొమ్మల మీద వాలి పాటలు పాడుతుంటే, పిల్లలు ఆటలు ఆపి మరీ వాటి గొంతు విని కేరింతలు కొట్టేవారు. ఒకానొక రోజు పొరుగు దేశం వెళ్లిన రాక్షసుడు, తొమ్మిది సంవత్సరాల తర్వాత తన ఇంటికి చేరుకుంటాడు. పొరుగు…

By సాహిత్య లోకం 12 Feb 2019 Off