ఆడవారూ!!! మీ ఆరోగ్యం మీ చేతుల్లో | 7 Health tips for women

దారిలో నడుస్తూ వెళ్తుండగా ఒక అమ్మాయిని చూడగానే, తాను చాలా ఆరోగ్యంగా ఉంది అని అనుకుంటాము. కానీ దాని వెనక కారణాలు ఆలోచించేంత సమయం మనకి ఉండదు. ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంది అంటే దానికి కారణం సంతోషం, శ్రమ మరియు ఆలోచనా విధానం. సంతోషం, శ్రమ ప్రతి వ్యక్తీ ప్రతి రోజూ ఎదురుపడేవే, కానీ ఆలోచనా విధానం మాత్రం మనమే దృఢపర్చుకోవాలి. అది అంత సులభమూ కాదు, అంత కష్టమూ కాదు, తామరాకు మీద నీటి చుక్క లాంటిదన్నమాట – మనం ఎంత నిలకడగా ఉంటే మన ఆలోచనలు అంత స్థిరంగా ఉంటాయి అనమాట. క్రింద చెప్పిన విధానాలను, Health tips for women, ఆచరిస్తే ఎటువంటి వారికైనా ఆరోగ్యం కుదుటపడి, జీవితంలో నూతనోత్సాహం రావడం ఖచ్చితం.

ఆరోగ్యానికి ఏడు [౭] సూత్రాలు – 7 Health tips for women

౧. రోజుని త్వరగా ఆరంభించండి

నిన్న గతంలో కలిసిపోయింది, రేపు సూన్యంలో ఉంది – ఈ రోజు మాత్రమే మీ చేతిలో ఉంది.

అలాంటి నిలకడలేని సమయం, మీకోసం ఎదురుచూస్తుంది అనుకోకుండా, రోజుని త్వరగా ప్రారంభించండి. మరియు బ్రహ్మ ముహూర్తంలో లేసి తర్జన-భర్జన పడనవసరం లేదు కానీ ఐదు [౫] గంటలకు నిద్రలేవడం మంచిది. లేవగానే ఆ రోజు ఎం చేయాలో మదిలో ఆలోచన చేసి, నెమ్మదిగా రోజుని ప్రారంభించండి.

౨. ధ్యానంతో ఆరంభం

ధ్యానం యొక్క విశిష్టతలు క్షీర సాగరంలో నిగూడాలు లాంటివి, మనం చేసే మధనంబట్టే ఫలితం ఉంటుంది.

ఈ రోజు పనులు ఎక్కువ ఉన్నాయి, ధ్యానం రేపు చేద్దాంలే. ఒక్క రోజు ధ్యానం చేయకపోతే ఏమి నష్టం జరగదులే అనే ఆలోచన వలన చాలా మంది స్త్రీలు ఈ గొప్ప సాధనాన్ని విడిచిపెట్టేస్తున్నారు.  ప్రతి రోజూ ఒక అర గంట ధ్యానం చేయడం వలన ఏకాగ్రత, ఉత్సాహం పెరిగి ఎటువంటి పనిని అయినా సమర్ధవంతంగా చేయగలుగుతారు. అంతే కాకుండా ధ్యానం వాళ్ళ మీ శరీరంలోని రుగ్మతలు తొలిగిపోతాయి.

౩. నీటి విశిష్టత

నీటి గురించి చెప్పడానికి గ్రంథాలు సరిపోవు.

అధిక బరువు, కడుపులో మంట, అజీర్తి, ఇలా అసంఖ్యాకంగా ఉన్న రోగాలను కొంత వరకు అదుపు చేయగల గుణం జలానికి ఉంది. ధ్యానం తర్వాత కానీ, ముందు కానీ, రెండు [౨] గ్లాసుల నీరు తాగితే కడుపు శుద్ధి అవుతుంది, పోషకాలను శోషించుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది, చర్మం ప్రకాశిస్తుంది మరియు అవయవాలు బాగా పని చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నీటి గురించే ఉంటుంది ఈ వ్యాసం అంతా. కాబట్టి ఉదయం తప్పకుండ నీటిని సేవించండి, రోజులో తరుచుగా నీటిని సేవించడం అలవాటు చేసుకోండి.

౪. పూటకో బహుమానం

ఈ రోజు అనుకున్న పని త్వరగా అయిపోయింది – సంతోషం; ఆ సంతోషంలో ఒక పండు తినండి.

ఈ రోజు అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు – విచారం; ఆ విచారం మర్చిపోడానికి రెండు పండ్లు తినండి.

మీ పై మీరు శ్రద్ధ వహించుకోకపోతే ఇంకెవరు వహిస్తారు? ఉదయం, మధ్యాహ్నం,రాత్రి తినే పదార్ధాలు కడుపు నింపడానికి అయితే, పూట మధ్య తినేవి ఆరోగ్యం కోసం. వీటి వలన భోజనం మీద కూడా ఆసక్తి తగ్గి శారీరిక దృఢత్వం పెరుగుతుంది.

౫. ఇతరులతో పోల్చుకోకండి

పోల్చుకోవడం, కొరివితో కట్టుకున్న చీరని కాల్చుకోవడం ఒకటే.

“ఎదురింటి ఆమె చూడు ఎంత లావుగా ఉండేదో, ఒక్కసారికి సన్నంగా అయిపోయింది”, ” అది నాకన్నా బక్కగా ఉండేది వదినా, ఎం తింటుందో ఏంటో వయ్యారంగా తయారైంది”; ఇలాంటి పోలికలు మహిళా లోకంలో సర్వసామాన్యం. ఇవి అనర్థదాయకం కూడా. ఎదుటి వారి పురోగతి మనకి ప్రేరణగా మారితే తప్పు లేదు కానీ అసూయా భావాలు పెరిగితే మన ప్రయత్నం కూడా విఫలం అవుతుంది. మీరు పాటించే పద్దతులపై నమ్మకం ఉంచి, తగిన సమయం ఇవ్వండి, తప్పకుండ ఆరోగ్యవంతులు అవుతారు.

౬. సంతోషానికి కాస్త సమయం

ఆనందం ఆరోగ్యానికి ఆయువుపట్టు.

మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో, మీ శరీరం అంత ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి, ఎన్ని పనులు ఉన్నా మీ మనసుకి నచ్చిన వాటిని మాత్రం విడవకండి. మీకు వీణ నేర్చుకోవడం ఇష్టమా? కాసేపు ఆ లోకంలో ఉండిపోండి, మీ పిల్లలతో గడపడం ఇష్టమా? అన్ని మర్చిపోయి మీరు చిన్న పిల్ల అయిపోండి, మీ ఆయనతో ముచ్చట్లు పెట్టడం ఇష్టమా? ఆ సరదా సమయాన్ని మంచి కబుర్లతో గడిపేయండి. మీ మనసు నిండా సంతోషాన్ని నిమ్పుకోండి; ఆరోగ్యం సగం మెరుగైనట్టే.

health tips for women

౭. నిద్రకి నిద్రే విరుగుడు

ఆడవారు రోజుకి పూర్తి చేసే పనులు మగవారు రెండు మూడు రోజులకి కూడా పూర్తిచేయలేరేమో. అంత భారాన్ని మొస్తే, అలసటగా ఉండడం సహజం. ఇలా అనిపించినపుడు, నచ్చిన పాట పెట్టుకునో, పుస్తకం చదువుతూనో కాసేపు నిద్రలోకి జారుకోవడం ఉత్తమం. పూటకో పది నిముషాలు పడుకోవడం వలన అలసట తీరిపోయి, మెదడు బాగా పని చేస్తుంది.

ఈ Health tips for women  కనుక మీరు ఏకాగ్రతతో పాటించినట్లు అయితే మీ ఆరోగ్యం మెరుగుపడి, మీ వయసు ఒక పది సంవత్సరాలు తగ్గిందేమో అనేలా చురుకుదనంతో జీవిస్తారు.

Comments

comments