పరిచయం

సాహిత్య లోకం – తెలుగు సాహిత్యం, తెలుగు వారి అభిరుచులనే కాక, ప్రపంచంలో ఉండే గొప్ప విషయాలను, మంచి పుస్తకాలను, ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ; తెలుగు వారికోసం ప్రత్యేకంగా ఏర్పర్చిన ఓ వేదిక.

ఈ వేదికలో దాదాపుగా ఒక వ్యక్తి మానసిక వికాసానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడే అంశాలు అన్నింటిని ప్రస్తావించాలనేది మా ముఖ్య ఉద్దేశం.
సాహిత్యం నూతన ప్రపంచాలని మనకి పరిచయం చేస్తాయి.
పిల్లల లోకం చిన్నారుల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
కవిత్వాలు [మీరు కూడా కవితలు పంపవచ్చు] బాషా చతురతను, ఆలోచనా విధానాలను పెంపొందిస్తాయి.
మంచి చిత్రాలు స్ఫూర్తినిస్తాయి.
మహిళా లోకం స్త్రీలకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, అరుదైన వంటకాలను పరిచయం చేస్తూ, స్త్రీ గొప్పతనాన్ని చాటుతుంది.
పై ప్రస్తావించిన విషయాలకు అతీతంగా ఉండే వాటిని [ఉదాహరణకు ఆలయ ప్రశిస్థి, వైజ్ఞానిక సమాచారం] ఇతర అంశాలలో పొందుపరచడం జరుగుతుంది.

సాహిత్య లోకం, ఈ వేదికను ఉపయోగించే మీ అందరిదీ కూడా. మీరు కూడా సాహిత్య లోకంలో మీకు తెలిసిన విషయాలను, కవితలను, మంచి మాటలను ప్రచురించుకోవచ్చు. అందుకోసం, ఈ చిరునామాను సంప్రదించండి: [email protected]
గమనిక: మీరు పంపిన ప్రతి ఆలోచన మా అంగీకారంతోనే ప్రచురించబడుతుంది. అన్ని ఆలోచనలను ప్రచురిస్తామనే హామీ ఇవ్వబడదు.