సింహం, మేక, మధ్యలో నక్క…
అనగనగా ఒక మహారణ్యంలో, ఆరోగ్యం బాగోలేని సింహం ఒకటి దగ్గుతూ, తుమ్ముతూ బతుకుతుంది. అరణ్యానికి రాజు అయిన సింహానికి చావు సమీపిస్తోంది అనగా ఒక కోరిక కలుగుతుంది, అదేమనగా, ఆ అరణ్యంలోనే బాగా పెద్దదిగా ధృడంగా ఉన్న మేకను తినాలి అనిపిస్తుంది. వెంటనే సింహరాజం, తన మంత్రి, స్నేహితుడు అయిన నక్కను పిలిచి తన కోరికను వివరిస్తుంది. నక్క, సింహం తనకి ఎన్నో సార్లు సహాయం చేసిందని, మంత్రిగా నియమించుకుని ఆడుకుంటుంది అని, సింహానికి ఎలా అయినా…
నీతి కథ: నక్క – మేక
మనుషులు వదిలేసి, అరణ్యంగా మారిన ఒక విశాలమైన తోటలో, సంవత్సరాల క్రితం తవ్విన బావి ఉంది. పక్షులకి, జలచరాలకి తప్ప అందులో నీరు జంతువులకి అందేది కాదు. ప్రాణ భయం కలిగిన జంతువులు బావిలో నీటి కోసం ఆశ పడకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లి దాహం తీర్చుకునేవి. ఆ అరణ్య సమీపంలో నివసించే ఒక నక్క – “ప్రతి రోజూ తిండి కోసం వెతకాలి, నీటి కోసం కూడా వెతకాలా?” అని ఆలోచిస్తూ, ఆ బావి దగ్గరకి…
పిల్లల పెంపకం, చేపల పెంపకం – పద్ధతి, నివారణ, చర్య
ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే పదాలు వినడానికి చాలా బాగుంటాయి, తగు మోతాదులో పంచితే ఆచరణలో అద్భుతంగా ఉంటాయి. కానీ ఇవి మితిమీరితే; తల్లి తండ్రులు నీటి నుండి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటారు. పిల్లలు కూడా అంతే, మొదట్లో ముదిగారం చేస్తే తర్వాత భూమి మధ్యకి వెళ్లి బంగారం తీసుకురమ్మంటారు. పిల్లల పెంపకం: నివారణ మరి ఏమి చేయమంటారు అండి, మరీ గుక్క పెట్టి ఏడ్చేస్తాడు మా వాడు, ఏమైనా అడిగింది చేయకపోతే. ఏడిస్తే కన్నీరు…
నీతి కథ: కాకి – కోయల
అనగనగా ఒక అడవిలో కోయలలు కలిసి నివసించేవి. అవి పూట అంతా దొరికిన ఆహారాన్ని ఒక దగ్గరకు చేర్చి, స్నేహితులు అందరితో పంచుకుని తినేవి. ఈ తంతుని చాలా రోజుల నుండి గమనిస్తున్న ఒక కాకి, ఏ కష్టమూ లేకుండా ఆహరం సంపాదించేయొచ్చు అని తన తెలివితో పన్నాగం పన్నింది. మగ కోయల నల్లగా, ఎర్రని రెక్కలతో తనకి దగ్గర పోలికలతో ఉంటుంది కాబట్టి కాకి తన రెక్కలకి ఎర్ర రంగు పూసుకుని చడీ-చప్పుడు లేకుండా కోయల…
ఒంటేనుగు | Camel & Elephant
అనగనగా ఒక అరణ్యంలో, ఏనుగుల గుంపు నుండి ఒక ఏనుగు విడిపోతుంది. దారి తెలియక చాలా సేపు తిరిగి, తప్పిపోయి ఆ అరణ్య సమీపాన ఉన్న ఎడారికి చేరుతుంది. ఎడారి అంటే సరిగ్గా తెలియని ఆ ఏనుగు, ముందుకు వెళ్తే నీరు దొరుకుతుందేమో అనే ఆశతో ఎడారిలోకి వెళ్తుంది. పాపం, ఆ ఏనుగు ఎంత తిరిగినా ఒక్క నీటి చుక్క కూడా కనిపించదు. ఇంతలో ఆ ఏనుగుకి దూరంలో ఒంటె కనిపిస్తుంది. సాటి జంతువు కనిపించిందని సంతోషంతో…