స్వర్గంలో రాక్షసుడు
ప్రతి మధ్యాహ్నం, బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, పిల్లలంతా ఆ రాక్షసుడి తోటలో ఆడుకునేవారు. ఆ తోట చాలా విశాలమైనది, మెత్తని గడ్డితో, పూల మొక్కలతో, పండ్ల చెట్లతో నిండి పిల్లలకి అమితమైన సంతోషాన్ని ఇచ్చేది. పక్షులు చెట్ల కొమ్మల మీద వాలి పాటలు పాడుతుంటే, పిల్లలు ఆటలు ఆపి మరీ వాటి గొంతు విని కేరింతలు కొట్టేవారు. ఒకానొక రోజు పొరుగు దేశం వెళ్లిన రాక్షసుడు, తొమ్మిది సంవత్సరాల తర్వాత తన ఇంటికి చేరుకుంటాడు. పొరుగు…
తూర్పున ఉదయించే చావు
“నా మజిలీలో మరొక్క రోజు, మరొక్క సృష్టి, మరొక్క చావు.” నేను మోసే ఉదయాలు ఇంకా దాహార్తితో కష్టపడట్లేదు, ఉదయపు కిరణాలు గడ్డి మైదానాలను ఆనందంతో నిద్రలేపగలుగుతున్నాయి. మేలుకోండి! మేలుకోండి! ఏ మనిషి చేతి గొడ్డలి మీ మీద పడదు అనే ధైర్యంతో మేలుకోండి, బద్దకాన్ని బెరడుగా చేసుకున్న వృక్షాల్లారా. పరిగెత్తు లేగ దూడ, నీ స్వాతంత్య్రం కొద్దీ సేపే, తల్లి పాల అమృతత్వం కోసం పరిగెత్తు. నిద్రలేవండి! తండ్రులారా – భూదేవిని తొలిచి మీరు పడే…