Category: సాహిత్యం

ఎలుక సహవాసం, కప్ప ఉన్మాదం – లేనూరు కథలు

లేనూరు అనే గ్రామం దగ్గర ఒక ఏరు పారుతుండేది, అది ఎన్నో జీవులకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పించేది. ఆ ఏటి వద్ద కీటకాలను పట్టుకుని జీవించేవి ఒక ఎలుక కుటుంబం. అవి ఏటి గట్టు దగ్గరే బొరియ చేసుకుని ఉండగా, అదే ఏటి దగ్గర కప్పల సమూహం ఉండేది. అందులో కప్పలన్నీ మిక్కిలి స్నేహపూర్వకంగా మసులుకుంటూ ఉండేవి. అయితే అందులో ఒక మండూకము మాత్రం మిక్కిలి క్రూర బుద్ధితో ఉండి, ఎవ్వరూ చూడనప్పుడు తనకంటే చిన్న జీవులను…

By సాహిత్య లోకం 23 Sep 2019 Off

రెక్కలు – లేనూరు అనే గ్రామంలో

తరాలు మారినా పల్లెటూరు లోని ప్రేమలు ఆప్యాయతలు మారవు అంటారు. ఆ అనురాగాలను వెతుకుతూ అతడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నో సంవత్సరాలు తర్వాత వెల్దామనుకున్నాడు. రెక్కలు కోసేసిన విహంగంలా పట్నం లో నాలుగు గోడల మధ్య, నవ్వు లేని నవ్వుల మధ్య, ప్రేమ లేని పలకరింపులు మధ్య, ఆశ గమ్యమైన మాటల మధ్య నలిగిపోయిన అతనికి ఒక రోజు చిన్నప్పిటి అమ్మమ్మ కథలు, తాతయ్య పెద్దరికం, పాలేరులతో ఆట, స్నేహితులతో వాగులు గుట్టలు తిరగడం…

By సాహిత్య లోకం 5 Aug 2019 Off

సమాధి, మూడు పక్షులు, అండము

ప్రవాహం లాంటి జీవితాన్ని వదిలి అతను సమాధి లో పడుకున్నాడు. ఎంత కాలం గడిచినా అరిషడ్వర్గాలు వీడక అతడి ఆత్మ అతడితో పాటే సమాధిలో గడుపుతుంది. స్వభావం చచ్చిపోలేదు, శరీరం కుళ్లిపోలేదు, ప్రాణం విడిచిపోలేదు. అంధకారంలో గడిపినవి క్షణాలో, యుగాలో తెలియని అతను భరించలేక తనకి తోడు ఉన్న వాటిని అన్నిటిని తనలో కలిపేసుకుని భూమిని నెమ్మదిగా తొలుచుకుంటూ బయటకి వచ్చాడు. నయానందకరమైన ఎన్నో దృశ్యాలను ఆశించిన అతడికి చుట్టూ ఎడారి కనిపించింది. నాగరికత, మనిషి జాడ…

By సాహిత్య లోకం 4 Jul 2019 Off

భూత వైద్యుడు కరివేపాకుల కృష్ణ

గ్రహబలం, గుండెబలం ప్రతికూలంగా వ్యవహరిస్తున్నాయా? పీడకలలు ఎక్కువగా వస్తున్నాయా? మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ దుష్టశక్తులు ప్రవేశించి ఉండొచ్చు… సత్వర ఉపశమనం కోసం సంప్రదించండి పూజ్య గురువులు, ప్రముఖ భూత వైద్యుడు కరివేపాకుల కృష్ణ గారిని… మీ ఒంట్లో శక్తి నశిస్తుందా? అనారోగ్యం మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం ఉండట్లేదా? మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం వెంటనే కలవండి మూలికా వైద్య శిఖామణి శ్రీ కరివేపాకుల కృష్ణ గారిని……

By సాహిత్య లోకం 8 Mar 2019 Off

రక్తం రుచి మరిగిన కొండముచ్చులు

సింహాచలంలో నివసించే వారికి అడవి పందులు, కుక్కలు, కుందేళ్లు వంటి జంతువుల్ని చూడటం కొత్తేమి కాదు. కొన్నిసార్లు చిరుతపులి జాడలు కనిపించడం కూడా సాధారణ విషయమే ఇక్కడ వారికి. కానీ ఆరోజు రాత్రి మాత్రం ఇంటి దగ్గర కుక్కలు ఒకటే గోల, అవి మొరుగుతుంటే చెవులు చిల్లులు పడుతున్నాయి. నిద్ర మాయం అయిపోయింది, ఇక చేసేదేమి లేక ఆ కుక్కల బాధ ఏంటో చూద్దాం అని కిటికీ దగ్గర నిల్చున్నాను. వీధి దీపాల వెలుతురులో నాలుగు కుక్కలు…

By సాహిత్య లోకం 22 Feb 2019 Off