చందమామ వ్యవసాయం – చంద్రుడు యొక్క స్నేహభావం
ప్రాచీన భరత ఖండమున, అన్ని రాజ్యములకు కేంద్రముగా “కరాళము” అను రాజ్యము. ఆ రాజ్యమును, ఎన్నో సంవత్సరాలు సుభిక్షంగా పాలించి, కీర్తి గడించిన రాజు నిర్వికల్పుడు. ఆయన రాజ్యాధికారం చేపట్టినప్పటి నుండి కరాళమే కాక, ఇతర రాజ్యములతో కూడా సాన్నిహిత్యము పెంచుకుని, భరత ఖండమును ఐక్యము చేయ ప్రయత్నం చేశారు. మహాజ్ఞాని అయిన, నిర్వికల్పుని రాజ్యాన్ని ముక్కోటి దేవుళ్ళు ఎల్లప్పుడూ వీక్షిస్తూ, ఎటువంటి కష్టం రానివ్వకుండా తమ దీవెనలతో కాపాడేవారు. అటువంటి రాజ్యంలో అనుకోని సమయం, అనుకోని…