కబీరు – దిగంబర రహస్యం – కవిత
దిగంబరుడవై తిరిగినా, జంతు చర్మము ధరించినా, నీలోని రాముని చూడకున్న ప్రయోజనమేమి? యోగి కోరు సంగమము భూతలమున సంచరించుట వలన వచ్చిన, వనాన జింక చేయు సంచరణ దానిని అమరము చేయదా? బోడి గుండు చేసిన ఆధ్యాత్మిక సాఫల్యమొచ్చునన్న, స్వర్గమంత గొర్రెలతో నిండి యుండునే. ప్రత్యుత్పత్తి చేయకుండ విత్తునాపిన, స్వర్గమందు నీకు చోటు దొరకునైతె, నపుంసకులే చేరెదరుగదా ప్రధమస్థానమున. కబీరు వాక్కు ఇది లక్ష్యపెట్టు సహోదరా, రాముని నామము లేకున్న ఎటుల సాధ్యము ఆత్మజ్ఞానము ప్రాప్తించుట? పదిహేనవ…