మొదటి వ్యాసం – తెలుగు భాష ఉనికిని కాపాడేందుకు ఏం చేయాలి?
భాష అన్నది కేవలం పదాలు, మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, భాషలో ఒక సంస్కృతి నిక్షిప్తమై ఉంటుంది. ఆ సంస్కృతిని పెంపొందించటానికి తరతరాలుగా ఏంతోమంది కృషి చేసి, ఆయా దేశ కాల మాన పరిస్థితులకి అణుగుణంగా జీవన విధానాన్ని, అలవాట్లను, ఆచారాలను మనకి అందించారు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, రోజూ జరిగే సన్నివేశాలను నాటకీయంగా వర్ణించడానికి తెలుగులొ బొలెడన్ని జాతీయాలు సామెతలూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, మన పూర్వ తరాలు యెలాంటి జీవితాన్ని గడిపేవాళ్ళో, వాళ్ళు చూసిన…