Category: కవిత్వాలు

నేటి భారతం మరియు నవ భారతం

నేటి భారతం ఏమిటి ఈ నేటి భారతం ఎటు వెళుతుందో ఏమిటో|| స్వాతంత్రం వచ్చిన తరువాతే స్వాగతించారు అజ్ఞానాన్ని స్వాతంత్రం వచ్చిన తరువాతే తెర తీశారు కుల మతాలకు|| ||ఏమిటి|| గడప దాటిన ప్రతి వనితకు లేనే లేదు స్వేచ్ఛ స్వాతంత్రం అర్ధరాత్రి కాదుగదా పగలే భయం ప్రతి క్షణం|| ||ఏమిటి|| రైతే రాజని అంటారు రైతు కడుపుని కొడతారు మధ్య తరగతి బతుకులకు త్రిశంకు స్వర్గం చూపిస్తుంది నేటి భారతం|| ||ఏమిటి|| ఎటు చూసినా ఆకలి…

By సాహిత్య లోకం 13 Aug 2019 Off

సాహిత్యలోకం కవితల పోటీ – June 2019

మే ౨౦౧౯ [May 2019] – జూన్ ౨౦౧౯ [June 2019] వ్యవధిలో సాహిత్యలోకం ప్రకటించిన కవితల పోటీ లో పాల్గొన్న వారిలో మా ద్వారా ఎంపికైన విజేతలకు మా శుభాకాంక్షలు. సాహిత్యం మనిషికి ఊపిరి కావాలని, సాహిత్యమే మనిషిని ఉన్నతుడ్ని చేయగలదని నమ్ముతూ, మన తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, వాణిజ్య పోకడలను అద్దుకుంటున్న మన తెలుగుకి పునర్వైభవం తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం.  ______________________________________________________________________________ కవితల పోటీ లో మొదటి స్థానం పొందిన వారు…

By సాహిత్య లోకం 15 Jun 2019 Off

పంచభూతములు – ఆలోచనలు , ఆక్రందనలు

౧ బ్రతుకు చెరను విడవజూచి ప్రేతమొక్కటినైతి, గగన మార్గమున తీసుకెళ్ల భటులిద్దరు రాకపోతిరి, కర్మ నిండక, కుండ కాలక భూతములతో కలిగె మైతిరి, పంచభూత భాష్యమెల్ల తెలిసి ఇచట తెల్పగోరితి. ౨ సహనంబు వీడి రోదించే భూమి : “భవభందముల్ వలచి సృష్టినే మరిచేను మనిషి, మోయునట్టి ధరిత్రిని దరిద్రమని అజ్ఞానంబుతొ  తలిచె, చేరు గమ్యాన్ని పతనంజేసె, తొలిచి తొలిచి హృదయంబున పొడిచె, కప్పుటకు మన్ను లేక, మట్టి భిక్షమెత్తుకోవలె కపట మహర్షి.” 3 పద్మంబున ఆసీనమై…

By సాహిత్య లోకం 26 Apr 2019 Off

అస్తమించే నాటకం

ప్రకృతి ఒడిలో ప్రియ కుసుమాల్లారా ఏకంకండి, కాల గమనం ఎప్పటికీ  పరుగెడు ఒంటిదోరణి బండి, చిరునవ్వులు చిందించే ఈ పుష్పం, రేపటి గమనంలో కాగలదు చర్మం కరిగిపోతున్న శవం. దివ్యమైన తేజస్సుగల ఆ సూర్యుడు, పై పైకి ఎగబాకుతున్నాడు, అతని నేటి నడక పూర్తికావస్తోంది, పడమరన ఈ నాటి నాటకం అస్తమించబోతుంది.  ప్రధమాంకంలో అనుభూతి చెందే వయసే ఉత్తమం, సత్తువగల శరీరం, ఉరకలు వేసే రక్తం మీ సొంతం.  అనుభూతి అనుభవమై, అనుభవం గుణపాఠామై, గుణపాఠం అధ్వానమైపోవును…

By సాహిత్య లోకం 26 Feb 2019 Off

నా రాధ – శ్రీ కృష్ణుని హృదయ తపము

మదియందు కల్లోలము , ఉష్ణోగ్రమున్ వేగలేక వివర్ణమౌ పింఛము… మ్రోగుటకు వేణువు ఊపిరేది అనగా, మురారిన్ జూచి వాయువు పాడలేననగా… వనమాలిని గాంచి పుష్పించుట మరిచె వనముల్, మధుభాషనుండి మౌనమున్ గ్రహింపలేక ఊగాడె పద్మముల్… ఉద్యానవనంబున పెరిగెనొక విచారంబు శ్రీ కృష్ణుని యదలోన నీట కన్నీరు చేరి, తడబాటుతో కదిలె జీవము కొలనులోన… “కుసుమ ప్రియా నయన, కమలాకర హృదయ చోర, రసరంజకమౌ నీ గానమున్ వినుటకు తపియించె మనసారా, సంకల్ప-వికల్పముల్ నొదిలి నీ ఆరాధ భూషణముల్…

By సాహిత్య లోకం 29 Jan 2019 Off